కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా
న్యూఢిల్లీ: మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా బుధవారం తెలిపారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని జోషి ట్వీట్ చేశారు. ఆయన ఇటీవల ఓ ఆధ్యాత్మిక కార్య్రకమంలో పాల్గొన్నారని సమాచారం.
ಆತ್ಮೀಯರೆ
ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ನನಗೆ ಸೋಂಕು ದೃಢಪಟ್ಟಿದೆ. ಯಾವುದೇ ರೋಗ ಲಕ್ಷಣಗಳು ಇರುವದಿಲ್ಲ. ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಹೋಮ್ ಕ್ವಾರಂಟೈನ್ ಆಗಿದ್ದೇನೆ.I have tested positive for #COVID19 . As I am asymptomatic, as per doctor’s advise I am in home quarantine.
— Pralhad Joshi (@JoshiPralhad) October 7, 2020