కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

బిహార్: కేంద్ర మాజీ మంత్రి రుఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్ గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.