కొండచరియలు విరిగిపడి 11 మంది దుర్మరణం

జకార్తా: గత కొన్ని రోజులుగా ఇండోనేసియాలో కురుస్తొన్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటికి తోడు తాజాగా రహదారి పక్కన ఉన్న కొండచరియలు విరిగి పడిన ఘఠనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.