కొండగట్టులో పోటెత్తిన భక్తులు

జగిత్యాల: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కరోనా మూలంగా కొన్ని నెలల పాటు భక్తుల తాకిడి నామ మాత్రంగానే ఉండేది. ఈ రోజు మంగళవారం కావడం.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భక్తుల రద్దీ నెలకొంది. కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రత్తల మధ్య అధికారులు భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అనుబంధ ఆలయమైన బేతాల స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయంలో నూతన వాహనాలకు పూజలు నిర్వహించుకోవడంతో పాటు ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.