కొండగట్టులో రామకోటి స్థూపానికి భూమిపూజ

కొండగట్టు: తెలంగాణలోని జగిత్యాల కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రామకోటి స్థూపం నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమిపూజ చేశారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదుట రూ.90 లక్షల వ్యయంతో ఈ రామకోటి స్థూపాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, సంజయ్‌కుమార్ తదితరులు ప్రధాన ఆలయంలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.