కొత్తగా క‌రోనా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ :  బ్రిటన్‌లో వెలుగు చూసిన `కొత్త స్ట్రెయిన్‌` భారత్‌లో 29 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర స‌ర్కార్ డిసెంబ‌రునెల‌లో యూకే విమాన సర్వీసులపై నిషేధం విధించింది. అయితే, ఈ నెల 6 నుంచి మళ్లీ విమాన సర్వీసులు పునరుద్ధరించనున్నట్లు పౌర విమానాయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ శుక్రవారం ప్రకటించారు. 6న భారత్‌ నుంచి యూకేకు తొలి ఫ్లైట్‌ నడువనుండగా.. 8న యూకే నుంచి భారత్‌కు ఫ్లైట్‌ రానుంది. ఈ క్రమంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యూకే నుంచి వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ మార్గర్శకాలను ప్రకటించింది.

మార్గదర్శకాలు ఇవీ..

  • యూకే నుంచి వచ్చే వారందరూ 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://www.newdelhiairport.inలో కొవిడ్ పరీక్షల్లో వచ్చిన నెగెటివ్‌ రిపోర్టు అందజేయాలి.
  • ప్రయాణికుడిని విమానంలోకి ఎక్కడానికి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కొవిడ్ నెగిటివ్‌ రిపోర్ట్‌ను పరిశీలించాలి.
  • ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ లేదంటే.. టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం కోసం చూసే వారి కోసం విమానాశ్రయంలో షెల్టర్, హెల్ప్‌ డెస్క్‌ కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.
  • సదరు ప్రయాణికుడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలి. నెగెటివ్‌గా తేలేవరకూ ఐసోలేషన్‌లో ఉండాలి.
  • కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన.. అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి.
  • ఎయిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.
Leave A Reply

Your email address will not be published.