ఎపిలో కొత్తగా 4,256 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,256 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. మరణాల సంఖ్య 6,019గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం 51,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాడు 7,558 మంది కోలుకోగా మొత్తం 6,66,433 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 61,50,351 కరోనా పరీక్షలు పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్క రోజు 38 మంది మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు, చిత్తూరు 5, కడప 5, గుంటూరు 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి 3, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.