కొత్త‌గా 24,712 క‌రోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 24,712 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న‌టి క‌న్నా మూడు శాతం అధికంగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక‌ 29,791 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఒక్క రోజే 312 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,01,23,778గా ఉంది. దీంట్లో యాక్టివ్ కేసులు 2,83,849 ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రిక‌వ‌రీ అయిన‌వారి సంఖ్య‌ 96,93,173. మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,46,756గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. అయితే తాజాగా ద‌క్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. మ‌రో వైపు అమెరికాలో సుమారు 10 ల‌క్ష‌ల మందికి క‌రోనా టీకాను వేశారు. గ‌త కొన్ని రోజులుగా బ్రిట‌న్ నుంచి భార‌త్ వ‌చ్చిన వారిలో 22 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. ఢిల్లీలో 11 మంది, అమృత్‌స‌ర్‌లో 8 మంది, కోల్‌క‌తాలో ఇద్ద‌రు, చెన్నైలో ఒక‌రు పాజిటివ్‌గా తేలారు.

Leave A Reply

Your email address will not be published.