ఖమ్మంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

ఖమ్మం: జిల్లాలో ఇవాళ (బుధ‌వారం) ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. కల్లూరు మండలం పోచారం సమీపంలో ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఓ బైక్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మరణించారు. మృతులు చిన్న కోరుకొండకు చెందిన రెడ్డి రామకృష్ణ, ఇంటి గోపిగా గుర్తించారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు దుర్మరణం

మరో ఘటనలో కారు బోల్తా పడటంతో ఇద్దరు మరణించారు. జిల్లాలోని పెనుబల్లి మండలం తుమ్మలపల్లి వద్ద ఇవాళ ఉదయం ఓ కారు అదుపుతప్పతి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందినవారిగా గుర్తించారు.

 

Leave A Reply

Your email address will not be published.