ఖమ్మం కార్పొరేషన్‌పై టిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం: పువ్వాడ

ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌పై మరోమారు టిఆర్ ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. త్వరలో జరుగనున్న కొర్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని పార్టీ ఆఫీస్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థని చెప్పారు. విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకోసం పార్టీలో చాలామంది ఔత్సాహికులు ఉన్నారని, ప్రజల్లో ఆదరణ ఉన్నవారితోపాటు గెలిచేవారికే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు.