ఖమ్మం జిల్లాలో 120 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు

ఖమ్మం : జిల్లాలోని వైరా, కొణిజర్ల పోలీసులు ఆదివారం ఇన్నోవాలో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూ. గో. జిల్లా చింతూరు నుంచి టీఎస్ (13ఈహెచ్8302) అనే ఇన్నోవా వాహనంలో సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలానికి చెందిన కేతావత్ ప్రవీణ్ అనే వ్యక్తి గంజాయిని కొనుగోలు చేసి జహీరాబాద్ తరలిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు కొణిజర్ల స్టేషన్ ఎదుట వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీంతో వైరా సీఐ వసంత్‌కుమార్, కొణిజర్ల ఎస్ మొగిలి తమ సిబ్బంది పోలీసు వాహనంలో వేగంగా వెళ్లి తనికెళ్లలోని విజయ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఇన్నోవా వాహనాన్ని అడ్డుకుకొని తనిఖీ చేశారు. అందులో మొత్తం సుమారు రూ.18 లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.