గంటా శ్రీనివాస్‌కు ఇండియన్‌ బ్యాంక్‌ షాక్‌

విశాఖ‌ప‌ట్ట‌ణం: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగిలింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈనెల 25న వేలం నిర్వహించనుంది. ప్రత్యూష కంపెనీకి చెందిన తొమ్మిది ఆస్తులను బ్యాంక్ వేలం వేయనుంది. ఇండియన్‌ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో గంటా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యూష కంపెనీ కోసం తీసుకున్న రుణం వడ్డీ సహా రూ.248.03 కోట్లు అయ్యింది. ఆ డబ్బు చెల్లించకపోవడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలకు సిద్ధమైంది. విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈనెల 25న వేలం వేసేందుకు సిద్ధమైంది. ఆ లోన్ తాలూకా వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మెుదటిసారిగా 2006 అక్టోబర్ 4న రుణ౦ చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో.. 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.