గణేశ్ గుప్తాకు ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శ

నిజామాబాద్: ఇటీవలే తండ్రిని కోల్పోయిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకుడు మహేశ్ గుప్తాను తెలంగాణ సిఎం కెసిఆర్ నిన్న (బుధవారం) పరామర్శించారు. గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా గత నెల 21న అనారోగ్యంతో కన్నుమూశారు. గణేశ్ గుప్తా స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో జరిగిన ద్వాదశ దినకర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం నేరుగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. అక్కడే కృష్ణమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బిగాల కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు.