గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య..!

హైదరాబాద్‌ : ఓ సెక్యూరిటీ గార్డ్ ​గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘ‌ట‌న రాణిగంజ్‌లో చోటుచేసుకుంది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జ‌రిగింది. బాధితుడు నల్గొండ జిల్లా బత్తులపాలెంకు చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. ఆత్మ‌హ‌త్య విషయం తెలిసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలాన్ని సంద‌ర్శించి కేసును న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గన్ మిస్ ఫైర్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు మహంకాళి పోలీసులు అనుమానిస్తున్నారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:మ‌ద్యం తాగి వేధిస్తున్న భ‌ర్త.. గొంతుకోసి చంపిన భార్య‌

Leave A Reply

Your email address will not be published.