గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

సూర్యాపేట‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతోపాటు డ్రైవర్‌, ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.