గిరిజనుల జీవనోపాధి పెంచడమే లక్ష్యం: అటవీ మంత్రి ఇంద్రకరణ్
గిరిజనుల జీవనోపాధి పెంచడమే లక్ష్యం: అటవీ మంత్రి ఇంద్రకరణ్

గిరిజనుల జీవనోపాధి పెంచడమే లక్ష్యం: అటవీ మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్: గిరిజనులలో పేదరికాన్ని రూపుమాపి ప్రతి ఒక్కరికీ ఆర్థిక బలం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గిరిజనుల జీవనోపాధి మార్గాలను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. నిర్మల్‌లలో రాంనగర్‌లోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో తోటి (గిరిజన తెగ) కులస్తులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకాల ఉపకరణాలను మంత్రి అల్లోల చేతుల మీదుగా పంపిణీ చేశారు. 1 మంది లబ్ధిదారులకు రూ. 12లక్షల నిధులతో తోపుడు బండ్లు, కట్టు మిషన్లు, పిండిగిర్ని ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులలో పేదరికాన్ని రూపుమాపి ప్రతి ఒక్కరికీ ఆర్దిక బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, ఆరోగ్య, ఉపాధి కల్పనతో పాటు పలు పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు.
ఆదివాసుల్లో అత్యంత వెనుకబడిన పీటీజీ కులాల అభ్యున్నతి కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులను ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాల ఉపకరణాల పంపిణీ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా ఎదగాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్‌పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్, ఐటీడీఏ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.