గుంటూరు: యువకుడి వేధింపులకు విద్యార్థిని బలి!

గుంటూరు: జిల్లాలో యువకుడి వేధింపులకు పదోతరగతి విద్యార్థిని బలైంది. యువకుడి వేధింపులు భరించలేక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని మేడికొండూరులో చోటుచేసుకుంది. తన మృతికి యువకుడి వేధింపులే కారణం అని విద్యార్థిని వీడియోలో పేర్కొన్నది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కూతురు మరణించడంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కూతురు మరణానికి కారణమైన యువకుడిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.