గొల్లవాగు ప్రాజెక్టులో నాటు పడవ మునిగి ఇద్దరు మృతి

మంచిర్యాల: జిల్లాలోని భీమారo మండలం గొల్లవాగు ప్రాజెక్టు లో నాటుపడవ మునిగి ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ (టాటా ఏసీ డ్రైవర్), ఇరవేని రాజా బాపు (ట్రాలీ డ్రైవర్ ), కలవేని రమేష్, మచ్చ రవి, బొంతల రమేష్ వీరు ఐదుగురు గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు వేటకు వెళ్లారు.
నాటు పడవ సహాయంతో చెరువులో చేపలను పడుతుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగి బొంతల రమేష్, ఇరవేని రాజబాపు ఇద్దరు గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా సింగరేణి రెస్క్యూ బృందం చర్యలు చేపట్టింది.