గ్యాస్ ట్రబుల్ – హోం రెమెడీస్
రుచికరంగా ఉండే ఆహార పదార్థాలను తినడమంటే అందరీకి చాలా ఇష్టం. ఎక్కువగా తింటుంటే కడుపులో నొప్పి, మరియు కడుపుబ్బరంకు దారితీస్తుంది. ఇష్టమైనప్పుడు, కడుపు నిండా తిన్నా..అరిగించుకోవడానికి బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి . ఈ హోం రెమెడీస్ పొట్ట ఉబ్బరం, గ్యాస్, హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఎక్కువగా తిన్నప్పుడు, జీర్ణం కానప్పుడు యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల కడుపుబ్బరం మరియు అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు. ఇవి వంటగదిలో మనందరికి అందుబాటులో ఉండేవే. మరి ఈ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం..
`జీర్ణశక్తి సన్నగిల్లి విరేచనం సాఫీగా కాకపోవడం వలన గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఏర్పడటం వలన శరీరంలో పైకి ఎగదన్ని కడుపులోనూ, ఛాతిలోనూ, నడుమునందు నొప్పి కలిగిస్తుంది. దీనివలన గుండె బలహీనమై గుండెజబ్బులు వచ్చే అవకాశముంది. దీనివలన పొట్ట అంతా ఉబ్బరంగానూ, గట్టిగా బిగదీసుకుపోయినట్లు వుంటుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి. ఇది సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది
తప్పకచదవండి: కరివేపాకు మన ఆరోగ్యానికి కల్పతరువు
మనం తీసుకునే ఆహారంలో బీన్స్, పాలు, జున్ను, ఐస్ క్రీం, గోధుమ, ఓట్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, దుంపపదార్థాలు ఎక్కువైనా, నూనెల వాడకం ఎక్కువైనా కూడా శరీరంలో గ్యాస్ ఏర్పడుతుంది. నిద్రలేకపోవడం వలన, త్రాగుడు, ఎక్కువ వేడిచేసే పదార్థాలు తీసుకోవడం వలన కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం…
- సరైన సమయాలలో క్రమబద్దంగా భోజనం చేయాలి. దుంపకూరలు, వేడిచేసే ఆహారపదార్థాలను కొంచెం మాత్రమే తీసుకోవాలి.
- ఆహారంలో నూనె వాడకం తక్కువగా వుండాలి. సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
- రాత్రిపూట భోంచేసిన తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.
- కాఫీ, టీ, సిగరెట్లు, మత్తుపానీయాలు మానేయాలి.
- నిలవ వుండే ఆహారాన్ని తీసుకోకూడదు.
- భోజనం అయిన వెంటనే పడుకోకుండా కొంత సేపు నడవాలి. మిఠాయి కిళ్ళీ వేసుకోవడం మంచిది.
అల్లం:ఒక కప్పు నీటిలో ఫ్రెష్ జింజర్ వేసి బాగా మరిగించాలి. తర్వాత వడగట్టి , భోజనం తర్వాత తాగాలి. ఇది గ్యాస్ ను తగ్గిస్తుంది. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు తాగితే మంచి పలితం ఉంటుంది. వివిధ రకాల వ్యాదులను నివారించుకోవడానికి దీన్ని తాగుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, టయర్డ్ నెస్, జలుబు దగ్గు నుండి రిలిఫ్ ను అందిస్తుంది.
పుదీనా: ఒక గుప్పెడు పుదీనా ఆకులు, బాయిలింగ్ వాటర్లో మిక్స్ చేసి బాగా మరిగించాలి. దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. పెప్పర్ మింట్ హెర్బ్ లో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి.
గ్రీన్ టీ: ఒక కప్పు వేడి నీటిలో కొన్ని గ్రీన్ టీ ఆకులు వేసి, బాగా మరిగించి తర్వాత వడగట్టి గోరువెచ్చగా తాగాలి. దీనికి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
-పూర్ణిమ