గ్రామీణాభివృద్ధే సర్కార్ ధ్యేయం: అధికారులతో సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయటమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. త్వరగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశానికి ఆయా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తనియా, పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఈఎన్సీ పీఆర్ సంజీవ రావు హాజరయ్యారు.