`గ్రేటర్‌`లో 100కు పైగా సీట్లు గెలుస్తాం: వినోద్ కుమార్‌

హైదరాబాద్‌: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వందకు పైగా సీట్లను గెలుచుకోబోతోందని ఆ పార్టీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతాంగం విషయంలో బీజేపీ ఘోరంగా విఫలమయ్యింది. ఉత్తర భారత దేశంలో రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. కేసీఆర్ ముందుగానే ఆలోచించి తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బంధు, రైతు భరోసా కల్పిస్తున్నారు. ఎర్రగడ్డ నుంచి ఉన్న జాతీయ రహదారి మరమ్మత్తులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇకనైనా బీజేపీ నాయకులు ఈ గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్‌కు ఏమి చేస్తారో చెప్పాలి. రేపు ప్రధాన మంత్రి వస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెళ్లి కూర్చొని డబ్బులు అడిగి తీసుకుని వస్తారా’ అంటూ వినోద్‌ సవాల్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.