‘గ్రేటర్’ ఫైనల్ ఓటింగ్ శాతం ప్రకటించిన ఈసీ

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 149 డివిజన్లలో పోలింగ్ జరగగా 46.68 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా కంచన్‌బాగ్‌లో 70.39 శాతం నమోదు కాగా, అత్యల్పంగా 32.99శాతం పోలింగ్ యూసప్‌గూడలో నమోదైంది. కాగా గత 20 ఏళ్లలో జీహెచ్‌ఎంసీలో ఇదే అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. క్రితంసారి ఎన్నికల్లో (2016) 45శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నిక ఆగిపోయిన ఓల్డ్ మలక్‌పేటలో గురువారం రీ-పోలింగ్ జరగనుంది.