`గ్రేటర్` ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఆధిక్యమంటే..!
హైదరాబాద్ : గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ (జిహెచ్ ఎంసి) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఓల్డ్ మలక్పేటలో వాయిదా పడిన పోలింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసిన అనంతరం ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా, జన్‌కీబాత్ సంస్థలు టిఆర్ ఎస్‌కు మెజార్టీ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.
ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. టీఆర్ఎస్‌కు 71-85 స్థానాలు (40.08 శాతం ఓట్లు), మజ్లిస్ పార్టీ 36-46 స్థానాలు (13.43), బీజేపీ 23-33 స్థానాలు (31.21 శాతం), కాంగ్రెస్ 0-6 స్థానాలు(8.58శాతం)కైవసం చేసుకోనున్నాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా
టిఆర్ ఎస్- బిజెపి మధ్య 9 శాతం ఓట్ల వ్యత్యాసం కనపడుతోంది.
ఇతరులకు 7.70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మరో సంస్థ జన్‌కీ బాత్ వెల్లడించిన ఎగ్జిట్ పో్ల్స్‌లోనూ టిఆర్ ఎస్ అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు 67-77 స్థానాలు (37.4 శాతం ఓట్లు), మజ్లిస్ పార్టీ 39-43 స్థానాలు (21 శాతం), బీజేపీ 24-42 స్థానాలు (33.60 శాతం), ఇతరులు 2 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 4.2 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు వివరించింది.