గ్రేట‌ర్ ఎన్నికల నేపథ్యంలో 62 లక్షలకు పైగా నగదు సీజ్

హైదరాబాద్: రాజ‌ధానిలో భారీగా హవాలా డబ్బు స్వాధీనం చేసుకునర్తు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు. షాహినాథ్ గంజ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిలేష్ పాటిల్, యోగేష్ ల నుండి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్.. బేగం బజార్ బీదర్ వాడి లోని ఓ పెంట్ హౌస్ లో ఎలాంటి పత్రాలు లేకుండా 20 లక్షలు రూపాయిలు తరలిస్తున్న సమయంలో మెరుపు దాడి చేసి 20 లక్షల రూపాయలుపట్టుకున్నారు. విచారణ నిమిత్తం ఇద్దరిని శాహినాధ్ గంజి పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 62 లక్షల 21 వెల 800 నగదు సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. 11 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు.. ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వెపన్స్ 1899 డిపాజిట్ చేసినట్లు తెలిపారు. 2393 మందిని బైండోవర్స్, 148 మందికి నాన్ బేలెబుల్ వారెంట్, 1823 మందికి నాన్ బేలెబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది. 4013 వివిధ పార్టీల కు చెందిన బ్యానర్లు , పోస్టర్లు 1032 బోర్డులు 2152 ప్లెక్సీ లు 3226 జెండాలు 1335 మొత్తంగా 11758 తొలగించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.