గ్రేట‌ర్ ఫైట్‌: రెండోరోజు 580 నామినేషన్లు

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు డిసెంబర్‌ 1న జరగనున్న సంగతి విధిత‌మే. రేపటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా… గురువారం నామినేషన్ల పర్వం కొనసాగింది. ఇవాళ (గురువారం) 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుంచి ఒకరు, సీపీఐ(ఎం) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 68, ఎంఐఎం నుంచి 27, టీఆర్ఎస్ నుంచి 195 మంది, టీడీపీ నుంచి 4, వైఎస్సార్సీపీ ఒకరు, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 15 మంది, స్వతంత్రులుగా 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 24న ఉప సంహరణతోపాటు తుది బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా.. డిసెంబర్‌ 3న అసరమైన చోట రీపోలింగ్‌, 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిన్నటి రోజున(బుధ‌వారం) కేవలం 20 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. నామినేషన్ల ప్రక్రియకు రేపు ఆఖరు తేదీ కావడంతో ఈరోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి అనుమతి ఉంటుంది. ఈరోజు రేపు పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నవంబర్ 21 వ తేదీన నామినేషన్ల పరిశీలనా, 22 న ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 1 వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉండగా, డిసెంబర్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.