గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గద్దెనెక్కే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి పెద్ద ఎత్తున విజయం అందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట నుంచి నాగోలు వరకు నిర్వహించిన రోడ్‌షక్షలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుకెళ్తోందన్నారు. రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చి కెసిఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారని నడ్డా వ్యాఖ్యానించారు. ప్రతి డివిజన్‌లో కమలం వికాసానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్షం కారణంగా రోడ్‌షోను మధ్యలోనే ముగించారు. అనంతరం తాజ్ బంజారా హోటల్‌లో నిర్వహించనున్న మేధావుల సదస్సుకు నడ్డా బయల్దేరి వెళ్లారు.