గ‌ద్వాల ఎమ్మెల్యే భిక్షాట‌న‌..

మ‌ల్ద‌క‌ల్‌: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైత‌న్న‌ల‌కు గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి ఓ భ‌రోసానిచ్చారు. అన్న‌దాత‌ల క‌డుపు నింపేందుకు ఎమ్మెల్యే భిక్షాట‌న చేప‌ట్టారు. జిల్లాలోని మల్ద‌క‌ల్ మండ‌లంలో ఎమ్మెల్యే జోలే ప‌ట్టుకుని ఇంటింటికి వెళ్లి పిడికెడు చొప్పున బియ్యాన్ని సేక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. సేక‌రించిన‌ ఈ బియ్యాన్ని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌కు పంపిస్తాన‌ని తెలిపారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. కేంద్రం కొత్త వ్య‌వ‌సాయ బిల్లుల‌ను త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకోవాల‌ని ఎమ్మెల్యే కృష్ణ మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.