చక్కని ఆరోగ్యానికి ఏ ఆహారం తీసుకోవాలి.. ఏమి తినకూడదు..

భోజనం చేస్తే జీవనం సాగుతుంది.శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పౌష్టిక సంతులిత ఆహారం ఆరోగ్యానికి, మెరుగుపరచి, రోగాలు రాకుండా చేస్తూ ఆనందమైన జీవితాన్ని నూరేళ్లు దీర్ఘాయుష్షుగా ఉంచుతుంది. మనం ఆహారం నియమితంగా పరిమితికి మించి హద్దులు దాటి తింటే బరువు పెంచుతుంది. అంతే కాకుండా ఎక్కువగా తిన్న ఆహారం అరుగుదల గాక అహితమైన భోజనం శరీరంలో విషాక్త పదార్దాలను పెంచి వివిధ రకాల జబ్బులను పుట్టిస్తుంది. అందుకే రోగాలు రాకుండా ఆహారమే ఔషధంగా తినేటట్లు భోజనం చేస్తే రోగాలు రావు. ఏ ఆహారం తినకూడదు, ఏది తినాలి. అనేది క్లుప్తంగా చెపుతాను. వీలుంటే ఆచరించండి.

అరుచి నయం కావటానికి తినే పదార్దాలు.

  •  అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి నిమ్మరసంలో వేసి కలపాలి.ఒక రెండు గంటల తరువాత సైoదవ లవణం కలుపోకొని తింటే అరుచి వెళ్లి ఆకలిని పేoచుతుంది.
  • కమల రసంలో సైoదవ లవణం మరియు మిరియాల చూర్ణం కలుపుకొని తాగాలి.
  • అల్లం బెల్లం సమానంగా కలిపి తినాలి.
  • క్యారెట్ జ్యూస్ లో మిరియాల చూర్ణం మరియు రాక్ సాల్ట్ కలిపి తాగాలి.
  • నిమ్మకాయ షర్బత్ లో ఓక లవంగా, 5 మిరియపు గింజల చూర్ణం,కలిపి తాగాలి.
  • నిమ్మకాయ ముక్క మీద ఉప్పు రాసి నాకాలి. వీటిలో ఎదో ఒకటి చేయాలి.

తినకూడని పదార్దాలు.

  • ఎక్కువగా నూనెతో తయారుచేసిన పదార్దాలు
  • గరం మసాలాలు
  • ఎక్కువగా నెయ్యి తినరాదు.
  • ఆమ్ల
  • పచ్చి మిర్చి
  • చనగ పిండి
  • మైదాపిండి
  • తినుబండారాలు తినకూడదు.
  • ఐస్ క్రీమ్  ఇవి తినకూడదు.

హెచ్చరిక: ఉదయం టిఫిన్ 9 గంటలకు తింటే, మధ్యాహ్నం భోజనం 1 గంటకు తినాలి. అంటే 4 గంటలు వ్యవధి ఇవ్వాలి. మరియు అది అరిగితేనే తినాలి.లేకపోతే తినకూడదు. మరియు మధ్యాహ్నం భోజనంకు రాత్రి భోజనంకు దరిదాపు 6 గంటలు వ్యవధి ఇవ్వాలి. తిన్న ఆహారం అరగక ముందే తింటే జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆహారమే ఔషధం.

-షేక్. బహర్ అలీ.
బి.ఏ.ఎం.ఎస్,(ఆయుర్వేద,యోగ)

 

Leave A Reply

Your email address will not be published.