చాటపర్రులో పేకాట శిబిరంపై దాడి.. భారీ మొత్తం స్వాధీనం

ఏలూరు: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో పేకాట శిబిరంపై అర్ధరాత్రి రూరల్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో ఈ దాడిని నిర్వహించారు. ఈ దాటిలో 18 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 1,95,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.