చామదుంప తింటే.. గుండెకు నూరేళ్లు!

దుంప కూరగాయల్లో కొన్నింటిని ఉడికించుకుని తింటే మరికొన్ని మాత్రం పచ్చిగానే తినొచ్చు. కొన్నింటిని కూర వండుకునే తినాలి. అలాంటి వాటిల్లో చామదుంప ఒకటి. చాలా మంది చామదుంపలు బాగా జిగురుగా ఉంటాయని వాటిని తినడం మానేస్తారు. కానీ ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. చామ దుంపలను మనం తరచూ ఆహారంగా తీసుకోవచ్చు.
ప్రయోజనాలు:
- చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. డైటరీ ఫైబర్ ను నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తాయి. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ దుంపలను తినవచ్చు. వీటివల్ల శరీరంలో ఎక్కువసేపు శక్తి నిలిచి ఉంటుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో కూడా ప్రోటీన్లు ఉంటాయి.
- బరువు తగ్గడంలో కూడా ఈ దుంపలు సహకరిస్తాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటిని తినడం వల్ల గుండెకు కావల్సిన పోషకాలు అందుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- చామదుంపలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, శరీరంలో విషపదార్దాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కోలన్ క్యాన్సర్ నుంచి ఉపశాంతి నిస్తుంది.
- గుండెజబ్బులకు, హైపర్ టెన్షన్‌కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ‘ఇ’ విటమిన్‌ను, రక్తపోటు క్రమబద్ధీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే డియోస్కోరిన్ అనే ప్రోటీన్ గుండె జబ్బులను, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది.
- చామదుంపల్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల ఆరోగ్యవంతమైన కాంబినేషన్ వల్ల కొవ్వును తగ్గించడమే కాకుండా శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి-6 కు సమృద్ధిగా ఉండడం వల్ల హైబీపీని తగ్గిస్తుంది.
- చామ దుంపల వల్ల మహిళల మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. పీరియడ్స్ లో వచ్చే నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు, కండరాల అలసట తగ్గించడంలో సహకరిస్తాయి. గర్భిణీలకు నీరు పట్టడం, ఉదయం వేళ వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి.