చిన్నజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పరామర్శించారు. సోమవారం రోజున ఆయన శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ శ్రీరాంనగర్‌లోని చిన్న జీయర్‌స్వామి ఆశ్రమానికి వచ్చారు. సీఎం కేసీఆర్‌ దాదాపు గంటపాటు స్వామి వారితో ఆశ్రమంలో గడిపారు. అనంతరం తిరిగి నగరానికి బయలుదేరారు. కాగా.. గత శుక్రవారం రోజున చిన్న జీయర్‌స్వామి తల్లి అలివేలు మంగతాయారు స్వర్గస్తులు అయ్యారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ఆశ్రమంలో చినజీయర్‌ స్వామిని కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌ను కలిసి కేసీఆర్ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు మైంహోం రామేశ్వరరావు ఉన్నారు. కాగా ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా చిన్నజీయర్ స్వామిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామితో వెంకయ్య మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.