చెట్టును ఢీకొన్న బైక్‌: ముగ్గురి మృతి

మెదక్‌ : సింగూరు డ్యామ్ చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు మృత్యు ఒడికి చేరిన ఘ‌ట‌న‌మెదక్‌ జిల్లాలో జరిగింది. మెదక్‌ పట్టణానికి చెందిన యువకులు సోఫిక్‌, జమీర్‌, సమీర్‌ పుల్కల్ మండలంలోని సింగూరు డ్యామ్ చూసేందుకు వెళ్తుండ‌గా మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా జమీర్‌, సమీర్‌ మృతి చెందారు. సోఫిక్‌ను హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగలక్ష్మి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.