చెన్నూరులో ట్రాక్టర్-డిసిఎం ఢీ ఒకరి మృతి

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జాతీయ రహదారి 63 పైన సోమావారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, డిజిఎం వాహనం రెండు బలంగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కెలోజి రాజశేఖర్ మరణించారు. ఈ ఘటనలో ట్రాక్టర్పైన ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉన్నట్టు సమాచారం. డిసిఎం వాహనం బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ముందు బాగం నుజ్జునుజ్యయింది. కాసేపటి క్రితమే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
