చెరువును తలపిస్తున్న జెడ్పి బాలికల పాఠశాల ఆవరణ…

మండపేట:- మండపేట పోలిస్ స్టేషన్ పక్కనే ఉన్న డాక్టర్ పాలడుగుల సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల ఆవరణ వర్షం నీటి తో నిండా మునిగింది. చెరువును తలపిస్తోంది. ఆవరణలో నీరు ముంచెత్తింది. చుట్టూ వున్న డ్రైన్ ల లోని నీరు ఇక్కడకి చేరింది. గతంలో ఎప్పుడు ఈ విధంగా నీరు నిలబడలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నాలుగు అడుగులు పైనే నీరు నిలిచింది. ఈ నీళ్లు బయటకు వెళ్లే మార్గం కూడా లేదు. ఇంకి పోవాలంటే నెలల సమయం పడుతుంది.  ఇప్పటికిప్పుడు పాటశాల లో క్లాసులు జరిగితే విద్యార్థిని లు , ఉపాధ్యాయులు చాలా అవస్థలు పడతారు.

ముంపు ప్రాంతాల్లో మంత్రి కన్నబాబు పర్యటన
అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చాలా ప్రాంతలు ముంపునకు గురయ్యాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో ముంపునకు గురైన పంటపొలాలును వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులతో కలసి బుధవారం పర్యటించారు.

భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యండమూరు, జి.బావవరం, వేళంగి, కూరాడ, పెద్ద కొత్తూరు, పాతర్లగడ్డ తదితర గ్రామాల్లో మంత్రి పర్యటించారు. పర్యటనలో ఎంపిడిఒ కర్రే స్వప్న, తహసీల్దార్‌ సిహెచ్‌.ఉదరు భాస్కర్‌, ఎడిఎ పద్మశ్రీ, మండల వ్యవసాయ అధికారి ఎ.గాయత్రి దేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.