చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో చోటు విషాదం చేసుకుంది. ఈత సరదా ఇద్దరి పిల్లల ప్రాణాలు తీసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బుర్రి సడువలి, రజిత దంపతుల కుమారుడు అర్జున్‌ప్రసాద్ (9), సుడిది రాంబాబు, భారతి దంపతుల కుమారుడు రాజ్‌కుమార్(10) 2వ, 3వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా.. ఇవాళ మధ్యాహ్నం రాజ్‌కుమార్, అర్జున్ ప్రసాద్ తమ పొలం దగ్గరలోని ఊర చెరువులో ఈతకొట్టడానికి నీటిలో దిగారు. ఎంతకీ బయటికి రాకపోవడంతో ఇది గమనించిన ఓ అమ్మాయి గ్రామస్తులకు తెలిపింది. చుట్టుపక్కల వారు వచ్చేలోగా విద్యార్థులు నీటిలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
