చైతన్యానికి ప్రతీక హుజురాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ (CLiC2NEWS): హుజురాబాద్ గడ్డ చైతన్యానికి ప్రతీక అని తెలంగాణ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చల్లూరు గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్ లో ఆదివారం జరిగిన వీణవంక మండల స్థాయి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌కు పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించింది నిజం కాదా అని ప్రశ్నించారు. పార్టీ పరంగా ఈటలకు జరిగిన నష్టమేంటో చెప్పాలని మంత్రి కొప్పుల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ్ పాల్గొన్నారు.