చైనాపై గుర్రుగా ఉన్న `క్వాడ్` దేశాలు!

న్యూఢిల్లీ: భారత్, అమెరికా, జపాన్, ఆస్ర్టేలియా క్వాడ్రలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) పేరిట ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ క్వాడ్ దేశాలు చైనా చర్యల పట్ల గుర్రుగా ఉన్నాయి. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి క్వాడ్ సమావేశాన్ని నిర్వహించడానికి భారత్ ముందుకు వచ్చింది. భారత సరిహద్దులు, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆగడాలు మితిమీరుతున్నవేళ త్వరలో జరగనున్న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంపై ఆసక్తి నెలకొన్నది. గతేడాది క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూయార్క్లో జరిగింది. ఈ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి!