చైనా బొగ్గుగని ప్ర‌మాదంలో 18 మంది మృతి

బీజింగ్‌: ఈశాన్య చైనాలోని చాంగ్‌కింగ్‌లో ఉన్న బొగ్గుగనిలో చిక్కుకుని 18 మంది కార్మికులు మరణించారు. గత సెప్టెంబర్‌లో సాంగ్‌జావో బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది మృతిచెందారు. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో ప్రమాదం సంభవించింది. చాంగ్‌కింగ్‌ ప్రాంతంలో గడిచిన రెండు నెలల్లో ఇది రెండో ప్రమాదం. చాంగ్‌కింగ్‌లోని డయాషుయిడాంగ్‌ బొగ్గు గనిలో నిన్న (శుక్ర‌వారం) సాయంత్రం 5 గంటలకు ప్రమాదం సంభవించింది. బొగ్గు గనిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు అధిక స్థాయిలో ఉండటంతో అందులో చికుక్కుపోయిన 18 మంది చనిపోయారు. ఈమేరకు అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.