చలికి గడ్డకట్టిన సరస్సు!
సిమ్లా: దేశంలో చలి వణుకుపుట్టిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా హిమాలయ పర్వతాల సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. పలుచోట్ల ఇండ్లపైన, రోడ్లపైన మంచు పేరుకుపోయింది. హిమాచల్ ప్రదేశలోనైతే ఏకంగా ఓ సరస్సే గడ్డకట్టుకుపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సబ్ జీరో స్థాయికి పడిపోవడంతో లాహౌల్-స్పితి జిల్లా జోబ్రాంగ్‌లోగల ఖొలుడు సరస్సు పూర్తిగా మంచుగడ్డలా మారిపోయింది. దీంతో గడ్డకట్టిన సరస్సుపై నడుస్తూ పర్యాటకులు కొత్త అనుభూతిని పొందుతున్నారు.
Himachal Pradesh: Kholudu Lake in Jobrang of Lahaul-Spiti district has frozen due to sub-zero temperature. pic.twitter.com/Vjy2V9XXzp
— ANI (@ANI) December 26, 2020