జనగామ: జాతీయ స్థాయికి ఎంపికైన సందీప్

జనగామ: జిల్లాలోని జఫర్ గఢ్ మండలంలోని ఓబులాపూర్‌కు చెందిన మొగులగాని సందీప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. సందీప్ ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ జఫర్‌గడ్ మండల ప్రధాన కార్యదర్శి నూకల రాజన్న ఆదివారం మీడియాకు తెలిపారు. ఈనెల 13 నుంచి 16 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న జాతీయ స్థాయి 68 వ సీనియర్ కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు నుంచి సందీప్ పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ తోటకూరి గట్టయ్య సహకారంతో సందీప్ జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి, ఛైర్మన్ వై కుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శి డా తోటకూరి వెంకటేశ్వర్లు, అంబాల ఆంజనేయులు గౌడ్, జఫర్‌గడ్ పిఏసిఎస్ ఛైర్మన్ తీగల కర్ణాకర్ రావు, సర్పంచ్ గార్లపాటి నీరజా రెడ్డి, జఫర్‌గడ్ ప్రధాన కార్యదర్శి రాజన్న, గ్రామస్థులు జాతీయ స్థాయికి ఎంపికైన సందీప్‌ను అభినందించారు.