జర్నలిస్టులపై దాడిచేసిన వారికి కఠినంగా శిక్షించాలి..
మహబూబాబాద్: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో రాజ్ న్యూస్ వీడియో జర్నలిస్ట్ భిక్షపతి పై జరిగిన దాడిని “మహబూబాబాద్ జిల్లా తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్” మహబూబాబాద్ జర్నలిస్టుల పక్షాన జిల్లా అధ్యక్షుడు చిర్రగోని ఉదయ్ ధీర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్టుల పై హింసను ఆపేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పన చేసి అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాజ్ న్యూస్ వీడియో జర్నలిస్ట్ భిక్షపతి పై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, దుండగులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, ప్రతీ ఒక్క వార్తను సేకరించడం జర్నలిస్టుల హక్కుఅని దాడులతో జర్నలిస్టులను భయపెట్టలేరని, తమ రాష్ట్ర వ్యాప్త జర్నలిస్ట్ సంఘాలు ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటానికి వెనకడుగు వేయమని హెచ్చరించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జర్నలిస్ట్ సంఘాల బాద్యులు పర్కాల రవీందర్ రెడ్డి,మట్టూరి నాగేశ్వరరావు,కట్కూరి ప్రసాద్, జర్నలిస్టులు శేఖర్, రాం ప్రసాద్, మధు, బాబురావు, మురళి, మధు,శ్రీనివాస్,శెట్టి వెంకన్న, పద్మం మహేష్, యాకన్న, సాయికుమార్, పాషా, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.