జర్నలిస్టుల్ని ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నాం: డీహెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషి చేస్తున్నాయని చెప్పారు.
జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. ఎల్లుండి నుంచి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారశాఖ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచినట్లు తెలిపారు.