`జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిసిలకు 50% టిక్కెట్లు ఇవ్వాలి`

మంచిర్యాల: పట్టణంలోని ఐ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో బీసీ ల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ జాగృతి జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు ఇస్తానని చెప్పడం హర్షించదగిన విషయం అన్నారు. అలాగే రాష్ట్రంలోని టిఆర్ఎస్ , సిపిఐ సిపిఎం, భారతీయ జనతాపార్టీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొంతం రాజు, అందే సంతోష్, నాగిరెడ్డి రమేష్, బుర్ర భూమ గౌడ్, ఆడెపు సురేష్, గరబోయిన శ్రీనివాస్, ఈన్నారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.