`జీహెచ్‌ఎంసీ` కొత్త కార్పొరేటర్ల పేరుతో గెజిట్ జారీ

హైదరాబాద్ : తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్‌ఈసీ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4వ తేదీ వెలువడిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లకు గాను అధికార టీఆర్‌ఎస్-56, బీజేపీ-48, మజ్లిస్-44, కాంగ్రెస్-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎక్స్ అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలు పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పొరేటర్లు. 35 మంది దాకా ఎక్స్ అఫిషియోల బలం. దీంతో వీరి బలం 91కి చేరుకుంటుంది. బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు(అయితే కొవిడ్ కారణంగా లింగోజిగూడ కార్పొరేటర్ రమేష్ గౌడ్ మృతిచెందారు), ముగ్గురు ఎక్స్ అఫిషియోలతో కలిపి వారి బలం 50. మజ్లీస్‌కు 44 మంది కార్పొరేటర్లు. 10 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి వీరి బలం 54. కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు, ఒక ఎక్స్ అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉంటాయి.
కాగా ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నెలఖారులో మేయర్ ఎన్నిక తేదీ ఖరారు కానుంది. త్వరలోనే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.