జీహెచ్‌ఎంసీలో మోగిన ఎన్నికల నగారా

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి పార్థ‌సార‌థి విడుద‌ల చేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్‌ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి షెడ్యూల్‌ విడుదల చేశారు. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా.. అసరమైతే డిసెంబర్‌ 3న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు వెల్లడించనున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.