స‌పోట పండు – ఔష‌ధ గుణాలు

స‌పోటా పండులో నిద్రను త్వరగా తెప్పించే గుణం వుంది. బాగా పండిన సపోటా పండు పొట్టు గింజలు తీసి వేసి మెత్తగా చేసి బెల్లం పాలు కలిపి వేడి చేసి రాత్రి పడుకునెప్పుడు తాగితే వెంటనే నిద్ర వస్తుంది. సపోటా పండులో పెరుగు కలిపి తింటే మామూలు విరేచనాలు , రక్త విరేచనాలు కూడా తగ్గి పోతాయి . ఇది కడుపులో పుళ్ళు రాకుండా కాపాడుతుంది. తలలో చుండ్రు పోవాలంటే , సపోటా గింజలను దంచి నువ్వుల నూనెలో కొద్దిగా వేడి చేసి తలకు పట్టించుకోవాలి. దీనితో పేలు కూడా రాలి పడిపోతాయి. సపోటా గింజలను దంచకుండా నూనెలో వేస్తె పేలిపోతాయి. తప్పక మెత్తగా దంచి వేసుకోవాలి

సపోటా చెట్టు ఆకులు మంచో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. సపోటా ఆకులను కడిగి త్రుంచి నీటిలో వేసి పసుపు కూడా కలిపి మరిగించి కాషాయం చేసి తాగితే తలనొప్పి పంటి నొప్పి తగ్గుతుంది . ఇందులో తేనే కూడా కలిపి తాగితే కాళ్ళ నొప్పులు తగ్గి పోతాయి. సపోటా ఆకుల లో సూక్ష్మ క్రిములను చంపే గుణం , వాపులను తగ్గించే గుణం వుంది.తలనొప్పి తీవ్ర స్థాయిలో వున్నప్పుడు సపోటా ఆకులను ఆముదం లో వేయించి నొసలుపై కట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. నిద్ర పడుతుంది. కొందరిలో అప్పుడప్పుడు తలా తిరుగుడు లక్షణాలు ఉంటాయి. ఇది ఒకరకమైన మానసిక ఒత్తిడి . సపోటా పండు గుజ్జులో రాత్రి నెయ్యి కలిపి ఉంచి మరు రోజు తింటే తల తిరగడం తగ్గి పోతుంది.

-పి.క‌మ‌లాక‌ర్ రావు

Leave A Reply

Your email address will not be published.