సమ్మెకు ఇది సరైన సమయం కాదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మంత్రి కేటీఆర్ కోరారు. లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. పెంచిన స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.
మరో వైపు తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్, రెసిడెంట్ వైద్యులు ఈ ఉదయం చేపట్టిన సమ్మెను జూడాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28 నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తెలిపారు.