జూరాల, శ్రీశైలం జలాశయాల‌కు పెరుగుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్ (CLiC2NEWS): ఈ మ‌ధ్య కాలంలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తుండ‌టంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో రెండు రోజులుగా జూరాల ప్రాజెక్టులోకి బారీగా నీరు వచ్చి చేరుతున్నది.

ప్రాజెక్టులో ప్రస్తుతం 318.400 మీటర్ల వరకు నీరు మట్టం ఉన్నది. దీంతో నీటి నిల్వ 9.418 టీఎంసీలకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, నిల్వ సామర్థ్యం: 9.657 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. 20,809 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనిలో 17,264 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి (శ్రీశైలం వైపు) విడుదల చేస్తున్నారు.

జూరాల నుండి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 3,309 శ్రీశైలం జలాశయంలో చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 20,573 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 33.8613 టీఎంసీలు ఉంది.

Leave A Reply

Your email address will not be published.