జైపూర్ సింగరేణి థర్మల్ ప్లాంట్ భూనిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

మంచిర్యాల: జైపూర్ సింగరేణి థర్మల్ ప్లాంట్ భూనిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ భూనిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2009 సంవత్సరంలో సింగరేణి సంస్థ చేపట్టిన పవర్ ప్లాంట్ ఏర్పాటులో జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటి గ్రామాల్లోని విలువైన భూములను తీసుకున్నారని.. అప్పడు పెగడపల్లిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భూములు కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత యాజమాన్యం భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. హామీల అమలులో నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. పైన పేర్కొన్నా గ్రామాలకు చెందిన భూములు కోల్పోయిన కుటుంబాల్లో కేవలం కొందరికి మాత్రమే ప్లాంట్ ప్రొడక్షన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంప్లాయిమెంట్ ఇచ్చారని ఆరోపించారు. పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేయడానికి అర్హత ఉన్నా కానీ unskilled వేతనాలు గల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుపుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు కాంట్రాక్ట్ ముగిసిపోతున్న సందర్భంగా మా గ్రామాల యువతకు మరికొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ఉద్యోగులందరికి వేతన చట్టం ప్రకారం వేతనాలు అందజేయాని కార్మికులు కోరారు..
ఆందోళన అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. మా సమస్యలపై సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వంతో సంప్రదించి మాకు న్యాయం చేయాలని వినతి ప్రతంలో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి థర్మల్ ప్లాంట్ భూనిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ డి. భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు రాజేంధర్, సలీన్, దుస్సా రాజమౌలి, బొప్ప రాజేశఖర్, ఎప్పలపల్లి రాజు, వేముల సందీప్ పాల్గొన్నారు.