జైపూర్ స‌మీపంలో కారును ఢీకొన్న లారీ

జైపూర్‌: మంచిర్యాల జిల్లా జైపూర్ మండ‌ల కేంద్రం స‌మీపంలోని వెలిశాల మల్లన్న దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. గురువారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళ్లున్న కారును లారీ ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను పోలీసులు మంచిర్యాల ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించారు. కాగా ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.